వైఎస్‌ జగన్‌ బర్త్‌డేకి యాత్ర

Yatra releases on YS Jagan's birthday - Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ‘యాత్ర’ చిత్రాన్ని వైఎస్‌ఆర్‌ తనయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మడమ తిప్పని నాయకుడు వైఎస్‌ఆర్‌ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే మా సినిమా. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. మా బ్యానర్‌లో వచ్చిన ‘భలే మంచి రోజు, ఆనందోబ్రహ్మ’ చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘యాత్ర’ చిత్రం హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివ మేక, కెమెరా: సత్యన్‌ సూర్యన్, సంగీతం: కె (కృష్ణ కుమార్‌).

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top