
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ యాత్ర. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ వరుస అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
తాజాగా చిత్ర దర్శకుడు మహి వీ రాఘవ్ వైఎస్సార్ ఘాట్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆయన గొంతు వినిపించే అవకాశం, ఆయన కథను ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శివా మేక సమర్పణలో 70 ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేడ్కర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Except for my roots, my mom who hails few miles away from idupulapaya(Kadapa)
— Mahi Vraghav (@MahiVraghav) 19 January 2019
Our paths never crossed but was destined & chosen to tell YS Rajasekhara Reddy’s story
Finally we did meet all I could do is to THANK HIM for making me his voice & for the opportunity to tell his story pic.twitter.com/oxyjlplyiU