యామీకి గుడ్‌బై చెప్పిన ప్రియుడు | Yami is the last person Pulkit would want to be involved with | Sakshi
Sakshi News home page

యామీకి గుడ్‌బై చెప్పిన ప్రియుడు

Jan 10 2016 3:57 AM | Updated on Sep 3 2017 3:23 PM

యామీకి గుడ్‌బై చెప్పిన ప్రియుడు

యామీకి గుడ్‌బై చెప్పిన ప్రియుడు

నటి యామీగౌతమ్ పేరు మరోసారి ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ మిక్కీడోనర్ చిత్రం ఫేమ్ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో గౌరవం చిత్రం ద్వారా పరిచయమైంది.

నటి యామీగౌతమ్ పేరు మరోసారి ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ మిక్కీడోనర్ చిత్రం ఫేమ్ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో గౌరవం చిత్రం ద్వారా పరిచయమైంది.ఆ తరవాత ఇక్కడ ఈ అమ్మడి నట ఫీచర్ అంత బ్రైట్‌గా లేదన్న విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒక సంచలన వార్తలతో మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంది.
 
 ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న యామీగౌతమ్ హిందీ నటుడు బుల్‌కిట్ సామ్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం హోరెత్తింది. సనమ్‌రే చిత్రంలో నటిస్తున్న సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందట. దీంతో అప్పటికే పెళ్లి అయిన బుల్‌కిట్ సామ్రాట్ తన భార్య సువేదా రోహిరాకు దూరం అయ్యారు. గత నవంబర్‌లోనే వారిద్దరూ విడిపోయారు.
 
  అయితే తాజాగా తన ప్రియురాలు యామీకి బుల్‌కిట్ బై బై చెప్పేశారట. యామీతో తిరగడంతో ఇండస్ట్రీలో చెడ్డ పేరు రావడంతో తన ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని భావించిన బుల్‌కిట్ సామ్రాట్ యామీగౌతమ్‌ను వదిలి తన తల్లిదండ్రుల చెంతకు వెళ్లినట్లు సమాచారం.అయితే ఈ వ్యవహారం గురించి బుల్‌కిట్ భార్య స్పందిస్తూ తన భర్తకు నటి యామీగౌతమ్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారనీ దాని గురించి తనకు ఎలాంటి చింతా లేదని తాజాగా వారి జీవతంలో ఏమి జరిగిందన్నది తనకు తెలియదని పేర్కొనడం గమనార్హం. ఇంతకీ ఈ వ్యవహారంపై యామీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement