బాబోయ్... ఎలుక! | WonderGeneration ... rat! | Sakshi
Sakshi News home page

బాబోయ్... ఎలుక!

Aug 12 2015 12:08 AM | Updated on Sep 3 2017 7:14 AM

బాబోయ్... ఎలుక!

బాబోయ్... ఎలుక!

కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డైరక్టర్ రేలంగి నరసింహారావు, కొంత విరామం తర్వాత తీసిన చిత్రం ‘ఎలుకా మజాకా’.

కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డైరక్టర్ రేలంగి నరసింహారావు, కొంత విరామం తర్వాత తీసిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిషోర్, పావని జంటగా నా ఫ్రెండ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
 
 రేలంగి నరసింహారావు మాట్లాడుతూ -‘‘ఎలుక ప్రధానంగా ఇంతవరకూ హాలీవుడ్‌లోనే వచ్చాయి. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. నేను కామెడీ చిత్రాలు మాత్రమే చేశాను. కానీ సీజీ వర్క్ నేపథ్యంలో సాగే హాస్యరస చిత్రం చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
 
 వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, గ్రాఫిక్స్: సత్య.
 

Advertisement
 
Advertisement
Advertisement