క్రిస్మస్ రోజు.. వర్మకు సవాలక్ష డౌట్లు | will jesus love isis too, doubts ram gopal varma | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ రోజు.. వర్మకు సవాలక్ష డౌట్లు

Dec 25 2015 1:58 PM | Updated on Sep 3 2017 2:34 PM

క్రిస్మస్ రోజు.. వర్మకు సవాలక్ష డౌట్లు

క్రిస్మస్ రోజు.. వర్మకు సవాలక్ష డౌట్లు

క్రిస్మస్ రోజున రాంగోపాల్ వర్మకు లెక్కలేనన్ని అనుమానాలు వచ్చాయి. ఐఎస్ఐఎస్‌ విషయంలో జీసస్‌తో లింకుపెట్టి తన అనుమానాలు అన్నింటినీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

క్రిస్మస్ రోజున రాంగోపాల్ వర్మకు లెక్కలేనన్ని అనుమానాలు వచ్చాయి. ఐఎస్ఐఎస్‌ విషయంలో జీసస్‌తో లింకుపెట్టి తన అనుమానాలు అన్నింటినీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అవేంటో ఓసారి చూద్దామా.. జీసస్ అందరినీ ప్రేమిస్తారంటే, ఐఎస్ఐఎస్‌ను కూడా ఆయన ప్రేమిస్తారా అని తొలుత అడిగాడు. ఇక తర్వాత.. జీసస్‌కు, అల్లాకు మధ్య యుద్ధం జరిగితే జీసస్ గెలుస్తారని, ఎందుకంటే ఆయన కండలు అంత అద్భుతంగా ఉంటాయని అన్నాడు.

రోమన్లు జీసస్‌ను అంత దారుణాతి దారుణంగా చంపితే, ఐఎస్ఐఎస్ మరి జీసస్‌ విషయంలో ఏం చేస్తుందోనని అనుమానం వ్యక్తం చేశాడు. జీసస్‌ను నమ్మే క్రిస్టియన్లు అందరినీ ప్రేమిస్తారని అంటారు కదా.. మరి ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్‌ను కూడా ప్రేమిస్తారా అని అడిగాడు. ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ బకర్ నుంచి అల్ కాయిదా సభ్యుల వరకు అందరినీ జీసస్ ప్రేమిస్తే.. అప్పుడు అమెరికన్లు మసీదులలో వెతకడం మానేసి తమ సొంత దేవుడి విషయంలో సమీక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. చివరగా 'మిస్టర్ జీసస్‌'కు హేపీ బర్త్‌డే చెప్పాడు. శాంతా క్లాజ్ ఇచ్చిన చాక్లెట్లు తిన్న తర్వాత ఐఎస్ఐఎస్ విషయంలో ఏమైనా చేయగలరేమో ఒక్కసారి ఆలోచించాలని అడిగాడు. అవీ మన రామూ డౌట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement