సంజయ్‌ దత్‌ బయోపిక్‌.. ఏ పాత్రల్లో ఎవరు?

Who Plays Who In Sanjay Dutt Biopic Sanju - Sakshi

న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజు టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్రను రణబీర్‌ కపూర్‌ పోషిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిర్వాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్‌ తన 22 ఏట నుంచి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇరుకున్న దాకా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు చూయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్‌ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న పరేష్‌ రావల్‌, మనిషా కోయిరాలా, దియా మీర్జా పాత్రల గురించి మీడియాకు వెల్లడించారు.

సునీల్‌ దత్‌గా పరేశ్‌ రావల్‌
ఈ సనిమాలో సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ పాత్రను పరేష్‌ రావల్‌ పోషిస్తున్నట్లు దర్శకుడు ధృవీకరించారు. తర్వాత విడుదల చేసే పరేష్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తామని తెలిపారు.

నర్గీస్‌ దత్‌గా మనీషా కోయిరాలా
సంజయ్‌దత్‌ తల్లిపాత్రకు మనీషా కోయిరాలాను తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. సంజయ్‌ దత్‌ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్‌ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్‌ బాధితురాలే. విదేశాలలో చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్‌ మహమ్మారి నుంచి మనీషా విజయవంతంగా బయటపడిన విషయం తెల్సిందే. సంజయ్‌ దత్‌, మనీషా కోయిలారా కలిసి యాల్గార్‌, కార్టూస్‌, సనమ్‌ చిత్రాల్లో నటించారు.

మాన్యతా దత్‌గా దియా మీర్జా
సంజయ్‌ దత్‌ జీవితాన్ని సమూలంగా మార్చిన మూడో భార్య మాన్యతా దత్‌ పాత్ర నటి దియా మీర్జాను ఎంపిక చేశారు. వీరిద్దరికీ 2008లో పెళ్లి అయిన సంగతి తెల్సిందే. సంజయ్‌ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ ఆమెనే చక్కబెట్టేవారు. సంజయ్‌ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిళ్లైల పాత్రలకు ఎవరిని తీసుకునేది దర్శకుడు ధృవీకరించలేదు.

సంజయ్‌ బాల్య మిత్రుడి పాత్రకు విక్కీ కౌశల్‌
సంజయ్‌ దత్‌ బాల్య మిత్రుడు కుమార్‌ గౌరవ్‌ పాత్రకు విశాల్‌ కౌశల్‌ను తీసుకుంటున్నట్లు ఊహాగానాలు గతంలో వినిపించాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విశాల్‌ కౌశల్‌ను ఈ పాత్రకు తీసుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. సంజయ్‌ దత్‌ రెండో సోదరి నమ్రతా దత్‌ భర్తే ఈ కుమార్‌ గౌరవ్‌.

తొలి చిత్ర సహనటి పాత్రకు సోనమ్‌
సంజయ్‌ దత్‌ తొలి చిత్రం రాఖీలో సంజయ్‌తో జోడీ కట్టిన టీనా మునిమ్‌ పాత్రకు సోనమ్‌ కపూర్‌ను తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే ట్రైలర్‌ వస్తేగానీ ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సల్లూ భాయ్‌ పాత్రకు జిమ్‌ సర్భ్‌
సంజయ్‌ దత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్‌ కండల నటుడు సల్మాన్‌ ఖాన్‌ పాత్రకు జిమ్‌ సర్భ్‌ను తీసుకుంటున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వారిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి సాజన్‌, చల్‌ మేరే భాయ్‌, ఓమ్‌ శాంతి ఓం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

జర్మలిస్టు పాత్రలో అనుష్క శర్మ
ఈ సినిమాలో అనుష్క శర్మ జర్మలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం.

కరిష్మా టన్నా, బొమన్‌ ఇరానీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కరిష్మా  టన్నా, మాధురీ దీక్షిత్‌ పాత్రంలో, బొమన్‌ ఇరానీ, కాంటే సినిమా దర్శకుడు సంజయ్‌ గుప్తా పాత్రలకు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్‌ దత్‌ బయోగ్రఫీ ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రం జూన్‌ 29న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top