హీరోయిన్‌కు ఘోర అవమానం! | When Harrison Ford did not recognise Jennifer Lawrence | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు ఘోర అవమానం!

May 13 2016 6:07 PM | Updated on Sep 4 2017 12:02 AM

హీరోయిన్‌కు ఘోర అవమానం!

హీరోయిన్‌కు ఘోర అవమానం!

సహ-నటుడు గుర్తుపట్టకపోవడంతో నటి చాలా బాధపడిపోయింది. ఏం చేస్తుందో కూడా తెలియకుండా అతని ముందు చిందేసేసింది.

లాస్ ఏంజెల్స్: జెన్నిఫర్ లారెన్స్..  ప్రస్తుతం ఈ పేరు హాలీవుడ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. కానీ, నటుడు హ్యారీసన్ ఫోర్డ్ ఒకప్పుడు ఆమె ఎవరో కూడా గుర్తించలేదట. ఈ విషయాన్ని లారెన్స్ 'గ్రాహం నోర్టాన్ షో' లో బయటపెట్టింది. బ్రిటిష్ కమెడియన్ జాక్ వైట్ హాల్‌తో బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది.

ఆ ఘటన అనంతరం ఫోర్డ్, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకన్ జేజే అబ్రమ్స్ తో కలిసి డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ వివరించింది. తాను అందరూ తనను గుర్తించాలని కోరుకోనని.. కానీ ఫోర్డ్, అబ్రమ్స్ కూడా తనను గుర్తించలేకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించానని తెలిపింది. దాంతో వారివద్దకు వెళ్లి ఏం చేస్తున్నానో కూడా అర్ధం కాకుండా డాన్స్ చేసినట్లు వివరించింది. ఆ తర్వాత తనకే చాలా ఇబ్బందిగా అనిపించినట్లు తెలిపిందీ హీరోయిన్. ప్రస్తుతం 'ది హంగర్ గేమ్స్: మాకింగ్ జే- పార్ట్-1' లో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement