గూగుల్‌లో థానోస్‌ అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా? | What Happend When You Google it for Thanos | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో థానోస్‌ అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా?

Apr 26 2019 1:51 PM | Updated on Apr 26 2019 2:05 PM

What Happend When You Google it for Thanos - Sakshi

ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను  క్యాష్‌ చేసుకోవటంలో గూగుల్‌...

ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను  క్యాష్‌ చేసుకోవటంలో గూగుల్‌ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ రిలీజ్‌ రోజున ఓ సరికొత్త మేజిక్‌ను గూగుల్‌ యూజర్స్‌ అనుభూతి చెందేలా చేసింది. అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌ సినిమా చూసిన వారికి క్లైమాక్స్‌ గుర్తుండే ఉంటుంది. థానోస్‌ తన హ్యాండ్‌ గ్లౌజ్‌తో చిటికె వేయగానే కొన్ని పాత్రలు బూడిదలా మారి వాష్‌ అవుట్‌ అవుతాయి.. ఇది సీను.

ఇక విషయానికి వస్తే గూగుల్‌లో సెర్చ్‌ ఇంజన్‌(కంప్యూటర్‌, మొబైల్‌)లో మనం థానోస్‌ అని టైప్‌ చేసి సెర్చ్‌ చేయగానే మనకు థానోస్‌ చేతికి ధరించే హ్యాండ్‌ గ్లౌజ్‌.. రైట్‌ సైడ్‌లో కన్పిస్తుంది. దాని మీద మనం క్లిక్‌ చేసినట్లయితే.. అది ఒక చిటికె వేస్తుంది. అప్పుడు జరగుతుందో మేజిక్‌. గూగుల్‌ తెరపై కనిపించే సెర్చ్‌ రిజల్ట్స్‌లో చాలా వరకు మాయం అవుతాయి.  అప్పటి వరకు లక్షల్లో చూపిస్తున్న సెర్చ్‌ రిజల్ట్స్‌ సైతం దారుణంగా కిందకు పడిపోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement