ఆకతాయికి ఇగో | We are planning to release the film for Ego Dasara | Sakshi
Sakshi News home page

ఆకతాయికి ఇగో

Jul 2 2017 11:45 PM | Updated on Sep 5 2017 3:02 PM

ఆకతాయికి ఇగో

ఆకతాయికి ఇగో

‘ఆకతాయి’ సినిమాతో యువతను ఆకట్టుకున్న ఆశిష్‌ రాజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ద్వితీయ చిత్రం ‘ఇగో’

‘ఆకతాయి’ సినిమాతో యువతను ఆకట్టుకున్న ఆశిష్‌ రాజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ద్వితీయ చిత్రం ‘ఇగో’. సిమ్రన్‌ కథానాయిక. ‘ప్రేమా గీమా జాన్తా నయ్‌’ ఫేమ్‌ ఆర్‌.వి. సుబ్రహ్మణ్యం (సుబ్బు) దర్శకత్వంలో వి.కె.ఎ. ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కరణ్, కౌశల్‌ కరణ్, అనిల్‌ కరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వ్యాపారవేత్త శ్రీనివాస్‌ గౌడ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ క్లాప్‌ ఇచ్చారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అహంభావం ఉన్న గోపీ, ఇందు ప్రేమకథతో తెరకెక్కనున్న చిత్రమిది. పల్లెటూరు, పట్టణ సంస్కృతుల నేపథ్యంలో ఉంటుంది. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తాం. హైదరాబాద్, పాలకొల్లులో ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తాం. దసరాకు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ప్రసాద్‌ జి.కె.

Advertisement
 
Advertisement
Advertisement