బాక్సాఫీస్‌పై వార్‌ దండయాత్ర.. | War Sets Box Office On Fire | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌పై వార్‌ దండయాత్ర..

Oct 7 2019 3:31 PM | Updated on Oct 7 2019 3:49 PM

War Sets Box Office On Fire - Sakshi

బాక్సాఫీస్‌ వద్ద హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన వార్‌ మూవీ దూకుడుకు బ్రేక్‌ పడలేదు.

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల మల్టీస్టారర్‌ వార్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఐదు రోజుల్లో ఈ మూవీ ఏకంగా 166.25 కోట్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ కేసరి, టోటల్‌ఢమాల్‌, సాహో (హిందీ వెర్షన్‌, చిచోరే, సూపర్‌ 30, గల్లీబాయ్‌ సినిమాల లైఫ్‌టైమ్‌ వసూళ్లను దాటిన వార్‌ త్వరలోనే భారత్‌, మిషన్‌ మంగళ్‌ల లైఫ్‌టైమ్‌ వసూళ్లను అధిగమిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వార్‌ వసూళ్ల ధాటికి దిగ్గజ సినిమాల రికార్డులు తెరమరుగవుతున్నాయని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. హిందీ, తెలగు వెర్షన్‌లు కలిపి ఐదు రోజుల్లోనే వార్‌ రూ 166.25 కోట్లు కలెక్ట్‌ చేసిందని ఆయన వెల్లడించారు. హిందీలో వార్‌ మూవీ బుధవారం రూ 51.60 కోట్లు, గురువారం​రూ 23.10 కోట్లు, శుక్రవారం రూ 21.30 కోట్లు, శనివారం రూ 27.50 కోట్లు, ఆదివారం రూ 36.10 కోట్లు రాబట్టిందని ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement