'గతంలో ఎప్పుడూ అలా నటించలేదు' | Wanted to do something in English, says Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

'గతంలో ఎప్పుడూ అలా నటించలేదు'

May 25 2016 5:10 PM | Updated on Apr 3 2019 6:34 PM

'గతంలో ఎప్పుడూ అలా నటించలేదు' - Sakshi

'గతంలో ఎప్పుడూ అలా నటించలేదు'

బాలీవుడ్ నుండి హాలీవుడ్ తెరకు ఎంతో మంది నటీనటులు పరిచయమయ్యారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నుండి హాలీవుడ్ తెరకు ఎంతో మంది నటీనటులు పరిచయమయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు. ఇప్పటికే దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా హాలీవుడ్ సినిమాలతో సందడి చేస్తుండగా మరో బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలంక అందం హాలీవుడ్ లోనూ తన మార్క్ పేరు తెచ్చుకునేందుకు తాపత్రయ పడుతోంది. ఇప్పటివరకూ అమెరికన్, బ్రిటీష్ మూవీలు, షోలు చేయలేదని అందుకే కాస్త కంగారుగా ఉన్నట్లు పేర్కొంది. అక్కడి మూవీల కోసం పూర్తిగా మారిపోవాలని అనుకున్నానని, నటీనటులకు హద్దులు లేవని అభిప్రాయపడింది.

మెర్సిడేజ్ పాపాలయా, కాథరిన్ బార్రెల్, బ్లైథే హబ్బార్డ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో ఆమె నటిస్తోంది. సైకాలజీ స్డూడెంట్ గా ఆమె కనిపించనుంది. మొదట చేయాల్సింది ఇంగ్లీష్ యాస మాట్లాడం నేర్చుకోవాలని అక్కడి వారు ఆమెకు సూచించారు. దీంతో ఇంగ్లీష్ మాట్లాడే యాసను మార్చుకోవడానికి హాలీవుడ్ మూవీలు చూశానని చెప్పింది. ప్రస్తుతం 'హౌస్ ఫుల్ 3' లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, లారాదత్తాలతో కలిసి నటించింది. గతంలో చేసిన సినిమాలలో అలాంటి చిత్రాలు చేయలేదంటూ హాలీవుడ్ మూవీ వివరాలు పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement