-
మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ చిత్రం 'హౌస్‌ఫుల్ 3' సినిమా తొలి మూడు రోజుల్లో 100 కోట్ల రూపాయల (గ్రాస్) వసూళ్లు సాధించింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. భారత్‌లో 73.02 కోట్లు, విదేశాల్లో 27.01 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు పేర్కొంది. ఘనవిజయం అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ సినిమా హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. శుక్రవారం విడుదలైన ఈ కామెడీ సినిమాకు భిన్నమైన టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3'లో అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించారు. అక్షయ్, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. -
రెండో రోజుల్లో రూ. 31.51 కోట్ల కలెక్షన్లు
ముంబై: ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'హౌస్‌ఫుల్ 3' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు 15.21 కోట్లు, రెండో రోజు 16.30 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజులు కలిపి మొత్తం 31.51 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3'లో అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించారు. ఈ కామెడీ సినిమాకు భిన్నమైన టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్' సినిమాకు థర్డ్ పార్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. అక్షయ్, రితేశ్ 'హౌస్‌ఫుల్' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. -
'హౌస్‌ఫుల్' కలెక్షన్లతో దూసుకుపోతోంది!
ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా కామెడీ సినిమా 'హౌస్‌ఫుల్-3'... హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. తొలిరోజు 15.21 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు మరింతగా పుంజుకొని రూ. 16.31 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రెండురోజుల్లో మొత్తంగా 31.51 కోట్లు రాబట్టింది. అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉన్నట్టు బాలీవుడ్ ట్రెడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. తొలిరెండో రోజుల్లో భారత్‌లో రూ. 31.51 కోట్లు సాధించిన ఈ సినిమా ఆదివారం మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విదేశాల్లోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టుతున్నదని, యూఈఏ కలుపుకొని విదేశాల్లో రెండురోజుల్లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్లు (రూ. 13.36కోట్లు) రాబట్టిందని వెల్లడించారు. గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. అక్షయ్, రితేశ్ 'హౌస్‌ఫుల్' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. -
ఆ సిన్మాకు తొలిరోజు సూపర్ కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3'... అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. తొలిరోజు మాత్రం ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 15.21 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హేడన్, నర్గీస్ ఫక్రీ నటించారు. అక్షయ్, రితేశ్ 'హౌస్‌ఫుల్' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. -
అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..!
సాధారణంగా సినిమా సెట్లో హుషారైన ఒక్క హీరోయిన్ ఉంటే చాలు సందడి వాతావరణం కనిపిస్తోంది. అలాంటి ముగ్గురు తారలు ఒకేసారి ఒకేచోటు ఉన్నారంటే వారి గొడవలు, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం సహజమే. కానీ, ఇక్కడ చూడండి లీసా హెడాన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఎంత జాలీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఓ ఫొటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. హౌస్ ఫుల్ లో అందమైన భామలు అంటూ ట్వీట్ చేశాడు. ఉదయ్ చోప్రాతో బ్రేకప్ తర్వాత మూడాఫ్ లో ఉన్న నర్గీస్ ఫక్రీ షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సిరీస్ మూవీలో ఎంత పాపులర్ చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్ నుంచి తాజాగా విడుదులకు సిద్ధంగా ఉన్న మూవీ 'హౌస్‌ఫుల్ 3'. 2010లో హౌస్‌ఫుల్, 2012లో హౌస్‌ఫుల్ 2 కామెడీ థ్రిల్లర్ మూవీలు. ఈ మూవీలో అలరించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ లేటెస్ట్ మూవీలో కూడా నటిస్తున్నారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, లీసా హెడాన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీని ఫర్హాద్, సాజిద్ తీస్తున్నారు. జూన్ 3న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. Housefull of Beautiful ladies @HaydonLisa @NargisFakhri @Asli_Jacqueline pic.twitter.com/7dTUHtxURh — Riteish Deshmukh (@Riteishd) 27 May 2016
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
కవితకు బిగ్ షాక్...నో బెయిల్
మళ్లీ సీఎం జగనే.. బాపట్ల రేపల్లె సిద్ధం (ఫొటోలు)
టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement