రెండో రోజుల్లో రూ. 31.51 కోట్ల కలెక్షన్లు | 'Housefull 3' mints over Rs 30 crore in 2 days | Sakshi
Sakshi News home page

రెండో రోజుల్లో రూ. 31.51 కోట్ల కలెక్షన్లు

Jun 6 2016 1:27 PM | Updated on Apr 3 2019 6:34 PM

రెండో రోజుల్లో రూ. 31.51 కోట్ల కలెక్షన్లు - Sakshi

రెండో రోజుల్లో రూ. 31.51 కోట్ల కలెక్షన్లు

ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'హౌస్ఫుల్ 3' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ముంబై: ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'హౌస్ఫుల్ 3' సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు 15.21 కోట్లు, రెండో రోజు 16.30 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజులు కలిపి మొత్తం 31.51 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3‌'లో అక్షయ్‌కుమార్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోలుగా నటించారు. ఈ కామెడీ సినిమాకు భిన్నమైన టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్‌' సినిమాకు థర్డ్ పార్ట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్, రితేశ్, అభిషేక్‌ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, లిసా హేడన్‌, నర్గీస్‌ ఫక్రీ నటించారు. అక్షయ్‌, రితేశ్‌ 'హౌస్‌ఫుల్‌' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement