ఆ సిన్మాకు తొలిరోజు సూపర్‌ కలెక్షన్లు | Housefull 3 mints Rs.15.21 crore on opening day | Sakshi
Sakshi News home page

ఆ సిన్మాకు తొలిరోజు సూపర్‌ కలెక్షన్లు

Jun 4 2016 6:03 PM | Updated on Sep 4 2017 1:40 AM

ఆ సిన్మాకు తొలిరోజు సూపర్‌ కలెక్షన్లు

ఆ సిన్మాకు తొలిరోజు సూపర్‌ కలెక్షన్లు

బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3‌'...

ముంబై: బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్‌-ఫర్హాద్‌ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3‌'... అక్షయ్‌కుమార్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌ హీరోలుగా నటించిన ఈ కామెడీ మూవీ మీద క్రిటిక్స్‌ పెదవి విరిచారు. రివ్యూలూ సోసోగానే వచ్చాయి. ఒక్క అక్షయ్‌ నటన తప్ప పెద్దగా కామెడీ లేకుండానే 'హౌస్‌ఫుల్‌-3' ఉందంటూ రివ్యూలు అభిప్రాయపడ్డాయి. ఈ రివ్యూల సంగతి ఎలా ఉన్నా.. తొలిరోజు మాత్రం ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 15.21 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలో సూపర్ హిట్ అయిన 'హౌస్‌ఫుల్‌' సినిమాకు థర్డ్ పార్ట్‌గా తాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ, రితేశ్, అభిషేక్‌ లకు జోడీగా జాక్వలిన్ ఫెర్నాండెజ్‌, లిసా హేడన్‌, నర్గీస్‌ ఫక్రీ నటించారు. అక్షయ్‌, రితేశ్‌ 'హౌస్‌ఫుల్‌' తొలి రెండు పార్ట్‌లలో కనిపించగా.. మూడో పార్టులో తాజాగా అభిషేక్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను నడియావాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది.

Advertisement
 
Advertisement
Advertisement