అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..! | Housefull of Beautiful ladies, says Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..!

May 27 2016 3:50 PM | Updated on Apr 3 2019 6:34 PM

అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..! - Sakshi

అందాల హీరోయిన్లు కలిస్తే ఇలా ఉంటుంది..!

సాధారణంగా సినిమా సెట్లో హుషారైన ఒక్క హీరోయిన్ ఉంటే చాలు సందడి వాతావరణం కనిపిస్తోంది.

సాధారణంగా సినిమా సెట్లో హుషారైన ఒక్క హీరోయిన్ ఉంటే చాలు సందడి వాతావరణం కనిపిస్తోంది. అలాంటి ముగ్గురు తారలు ఒకేసారి ఒకేచోటు ఉన్నారంటే వారి గొడవలు, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం సహజమే. కానీ, ఇక్కడ చూడండి లీసా హెడాన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్ ఎంత జాలీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించి, డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఓ ఫొటోను తన ఖాతాలో పోస్ట్ చేశాడు. హౌస్ ఫుల్ లో అందమైన భామలు అంటూ ట్వీట్ చేశాడు. ఉదయ్ చోప్రాతో బ్రేకప్ తర్వాత మూడాఫ్ లో ఉన్న నర్గీస్ ఫక్రీ షూటింగ్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సిరీస్ మూవీలో ఎంత పాపులర్ చెప్పనక్కర్లేదు. ఆ సిరీస్ నుంచి తాజాగా విడుదులకు సిద్ధంగా ఉన్న మూవీ 'హౌస్ఫుల్ 3'. 2010లో హౌస్ఫుల్, 2012లో హౌస్ఫుల్ 2 కామెడీ థ్రిల్లర్ మూవీలు. ఈ మూవీలో అలరించిన అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్ లేటెస్ట్ మూవీలో కూడా నటిస్తున్నారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, లీసా హెడాన్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీని ఫర్హాద్, సాజిద్ తీస్తున్నారు. జూన్ 3న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement