పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది | Uday cancels wedding with Nargis | Sakshi
Sakshi News home page

పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది

May 13 2016 11:47 AM | Updated on Sep 4 2017 12:02 AM

పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది

పెళ్లికి నో అన్నాడని, వెళ్లిపోయింది

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ కపుల్ జాయిన్ అయ్యింది. చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్న...

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ జంటలు విడిపోగా తాజాగా ఈ లిస్ట్ లో మరో హాట్ కపుల్ జాయిన్ అయ్యింది. చాలా రోజులుగా  డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీలు విడిపోయారు. నర్గీస్ పెళ్లి ప్రస్థావనను ఉదయ్ తిరస్కరిచటంతో అలిగిన నర్గీస్ న్యూయార్క్ వెళ్లిపోయింది.

గతంలో ఉదయ్ పెళ్లి చేసుకుందామన్న సమయంలో తన కెరీర్ మీద దృష్టి పెట్టిన నర్గీస్ ఫక్రీ పెళ్లికి నో చెప్పింది. ఇప్పుడు అదే ప్రస్తావనను నర్గీస్ తీసుకువచ్చినప్పుడు ఉదయ్ చోప్రా నో చెప్పాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన నర్గీస్ ఫక్రీ అజర్, హౌస్ ఫుల్ 3 సినిమాల ప్రమోషన్ తో పాటు బాంజో షూటింగ్ ను కూడా మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement