విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులు | Vishnu Vishal to romance Tamanna in Tamil remake of Pelli Choopulu | Sakshi
Sakshi News home page

విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులు

Mar 26 2017 2:41 AM | Updated on Sep 5 2017 7:04 AM

విష్ణువిశాల్‌తో  పెళ్లిచూపులు

విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులు

నటి తమన్నా యువ నటుడు విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోంది. ఏమిటీ నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండీ బాబు.అయితే రియల్‌గా కాదులెండి.

నటి తమన్నా యువ నటుడు విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోంది. ఏమిటీ నమ్మబుద్ధి కావడం లేదా? నిజమేనండీ బాబు.అయితే రియల్‌గా కాదులెండి. రీల్‌లో ఆ తంతంగానికి మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం పెళ్లిచూపులు. విజయ్‌దేవరకొండ, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌భాస్కర్‌ తెరకెక్కించారు. రెండు కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ పెళ్లిచూపులు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌ సినీపండితుల్ని ఆశ్చర్యానికిలోను చేసింది. దీన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఆంధ్రరాష్ట్రం అంతటా విడుదల చేసింది.

అలాంటి పెళ్లిచూపులు చిత్ర తమిళ రీమేక్‌ హక్కులను దర్శకుడు గౌతమ్‌మీనన్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకిగా ఇప్పటికే నటి తమన్నాను ఎంపిక చేశారు. కథానాయకుడి కోసం చర్చలు జరపగా యువనటుడు ఉదయనిధి స్టాలిన్, విష్ణువిశాల్‌ పేర్లు పరిశీలనకు రాగా చివరికి విష్ణువిశాల్‌నే అవకాశం వరించింది. దీనికి గౌతమ్‌మీనన్‌ తన శిష్యుడు సెంథిల్‌ వీరాస్వామిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత సంస్థలో నిర్మించనున్నారు.

పొణ్‌ ఒండ్రు కండేన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. అలా తమన్నా.. విష్ణువిశాల్‌తో పెళ్లిచూపులకు సిద్ధం అవుతోందన్నమాట. ఇప్పటికే ఈ భామ శింబుతో అన్బానవన్‌ అసరాధవన్‌ అడంగాధవన్‌ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. ప్రపంచ సినిమానే ఎదురుచూస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ చిత్రం బాహుబలి–2 చిత్రం ఏప్రిల్‌ 28న వెండితెరపైకి రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement