
గోల్డెన్ ఛాన్స్ అంటున్న మంచు విష్ణు
మంచువారబ్బాయి విష్ణు పార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ను ప్రారంభించాడు. హీరోగానే కాకుండా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో నిర్మాతగా మారిన మంచు విష్ణు ప్రతి ఏటా పొట్టి సినిమాల కాంటెస్ట్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మంచువారబ్బాయి విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ను ప్రారంభించాడు. హీరోగానే కాకుండా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో నిర్మాతగా మారిన మంచు విష్ణు ప్రతి ఏటా పొట్టి సినిమాల కాంటెస్ట్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల పాటు ఈ కాంటెస్ట్ జరగనుంది. ఈ సందర్బంగా విష్ణు ఏం చెప్పాడంటే.. 'సినీ పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన వారికి ఒక గొప్ప అవకాశం కూడా ఉంటుంది. మా సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్లో ఏదైనా ఫీచర్కు దర్శకత్వం వహించవచ్చు.
ఒకసారి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సరిపోదు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిత్యం కొత్త కోణంలో సినిమాలు చేయాలి. నేను కేవలం చిన్న అవకాశం కల్పిస్తున్నాను. ఇదే ఫైనల్ కాదు' అని అన్నారు. షార్ట్ ఫిల్మ్ విజేతలను ప్రతి ఏడాది తన తండ్రి, నటుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్ బాబు పుట్టినరోజు మార్చి 19న ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు.