short film contest
-
‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్ పోటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్–2021 పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఎండీ ప్రకటన విడుదల చేశారు. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండాలని సూచించారు. నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్ కంటెంట్‌ను డీవీడీ/పెన్‌డ్రైవ్, బ్ల్యూరే ఫార్మాట్లలో డిసెంబర్ 31లోగా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివరాలకు www. apsftvtdc. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. -
షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు వైఎస్సార్సీపీ ఆహ్వానం
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా రూపొందించే డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆలోచన మేరకు ఈ కాంటెస్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఔత్సాహికులకు ఆహ్వానం పలుకుతోంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టేలా లఘుచిత్రాలు రూపొందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కాంటెస్ట్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి దోహదం చేసినట్లవుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సౌజన్యంతో అందజేస్తున్నట్లు తెలిపారు. రెండు విభాగాల్లో పోటీలు డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను రెండు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షార్ట్‌ఫిల్మ్ నిడివి 10 నిమిషాలుగా, డాక్యుమెంటరీ నిడివి 15 నిమిషాలుగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ. 5లక్షలు, రూ.2లక్షలు, రూ.50వేలు, రెండు విభాగాల్లో కలిపి మొత్తం రూ.15 లక్షలను ప్రోత్సాహకంగా అందించనున్నారు. ఎంట్రీ ఉచితం ఆసక్తి గలవారంతా పోటీల్లో పాలుపంచుకునేలా ఎంట్రీలను ఉచితంగానే స్వీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 30వ తేదీ గడువు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు వెలుగులోకి తెచ్చేలా, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా ఔత్సాహికులంతా పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొన్నాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ ఐటీ వింగ్ పిలుపునిచ్చింది. మరిన్ని వివరాలకు 76598 64170 ఫోన్ నంబర్లో లేదా ఈ మెయిల్ ysrcp vizagitwing@gmail. com, www.ysrcpvizagitwing.com వైబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. -
షార్ట్ ఫిల్మ్స్‌కు ఆహ్వానం
మంచి క్రియేటర్‌గా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైన ఆలోచనలు ఆచరణలో పెట్టి ఆకట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు ఆ అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది యప్ టీవీ. వివిధ వార్తా చానళ్లను చూపించే యప్ టీవీ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌ల పోటీ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఈ కార్యక్రమానికి యప్ టీవీ తెరతీసింది. క్రియేటివిటీ ఉన్నవాళ్లను ప్రోత్సహించేందుకు తాజాగా షార్ట్ ఫిల్మ్స్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేసింది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ లు ఏ భాషలోనైనా రూపొందించవచ్చు. అయితే ప్రాంతీయ భాషల్లో తీసినప్పుడు మాత్రం వాటికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ చిత్రాలను పరిశీలించే జ్యూరీ ప్యానెల్ లో ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, కేతన్ మెహతా, సుదీర్ మిశ్రా ఉన్నారు. ఈ చిత్రాలను పంపించడానికి ఆఖరు తేదీని డిసెంబర్ 11గా నిర్ణయించారు. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లకు రూ.5లక్షల వరకు నగదు బహుమతితోపాటు 20 ఉత్తమ చిత్రాలను ప్రసారం చేస్తారు. -
కాఫీ విత్ పూరి
యువదర్శకులతో పూరి జగన్నాథ్ చిట్‌చాట్ ‘‘సార్ మిమ్మల్ని కలవాలని చాలా ట్రైం చేశాం. అయినా కుదర్లేదు.. మీ షూటింగ్ స్పాట్‌కు వచ్చినా సరే మమ్మల్ని తోసేసేవారు.. అలాంటిది మీతో ఇలా కలిసి మాట్లాడతామని అసలు అనుకోలేదు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం...’’ దర్శకుడు పూరి జగన్నాథ్‌ని కలి సిన ఆనందంలో యువదర్శకులు ఆయనతో చెప్పిన మాటలివి. వీళ్లం దరూ పూరీని కలవడానికి వేదికగా నిలి చింది ‘సాక్షి’. సాక్షి మీడియా గ్రూప్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి, నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పన్నెండు మంది దర్శకులు విజేతలుగా ఎంపికకైన విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో జరిగిన అవార్డు వేడుకలో ఈ యువదర్శకుల అభిమానాన్ని చూసి కదిలిపోయిన పూరి జగన్నాథ్ ఆదివారం వీరిని తన ఆఫీసులో కాఫీ పార్టీకి ఆహ్వానించారు. ‘జ్యోతిలక్ష్మి’ విడుదల బిజీ ఓ వైపు, నితిన్‌తో సినిమాకి సన్నాహాలు మరోవైపు, చిరంజీవి 150వ సినిమాకి కథ తయారు చేసే పని ఇంకోవైపు.. ఇలా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ కాఫీ పార్టీకి సమయం కేటాయించడం అంత సులువు కాదు. జూబ్లీహిల్స్‌లోని తన కేవ్ (పూరి జగన్నాథ్ ఆఫీస్)లో షార్ట్ ఫిలిం దర్శకులు, వారి బృందంతో రెండు గంట లసేపు ముచ్చటించారు పూరి. తమ అభిమాన దర్శకునితో ఫొటోలు, సెల్ఫీ లు దిగారు. పూరి దర్శకత్వం వహిం చిన చిత్రాల్లోని డైలాగ్స్‌ను తమదైన శైలిలో చెప్పారు. ఇలా రెండు గంటలూ ఆద్యంతం హాయిగా,సరదాగా గడిచి పోయింది. ‘ఆయనతో మాట్లాడతామ ని, కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం కల్పిం చిన సాక్షి మీడియాకు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు’ అని విజేతలు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. -
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 10) : త్రీడీ లవ్
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 10): ఇదేదో బాగుంది
-
పూరి డైరెక్టర్స్ హంట్(ఐడియా 10): త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్
-
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ : ఐడియా-10 ఫైనల్ లిస్ట్
‘‘పూరి జగన్నాథ్ ‘డెరైక్టర్స్ హంట్’ కాంటెస్ట్‌లో ‘ఐడియా నం. 10’కి న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. పూరి జగన్నాథ్ చాలా తమాషా కథాంశం ఇచ్చారు. ప్రేమ గతంలో ఎలా ఉండేది...ఇప్పుడు ఎలా ఉంది..భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనే ఓ విన్నూత్నమైన ఐడియా ఆధారంగా తీసిన వాటిల్లో మూడు లఘు చిత్రాలు ఎంపిక చేశాను. సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయనే విషయం పక్కనపెడితే, కథను ఎలా డీల్ చేశారనే ప్రాతిపదికగా వీటిని ఎంపిక చేశాను.’’ - తనికెళ్ల భరణి, నటుడు-రచయిత-దర్శకుడు ఐడియా నం.10 జ్యూరీ మెంబర్: తనికెళ్ల భరణి 1) ఇదేదో బాగుంది దర్శకుడు: శ్రీకాంత్ రెడ్డి sbrlikes@gmail.com 2) త్రీ జనరేషన్స్ ఆఫ్ లవ్ దర్శకుడు: సమర సింహా రెడ్డి nampallisatish@gmail.com 3) త్రీడీ లవ్ దర్శకుడు: వి. గోపీనాథ్ asifacf3676@gmail.com ఈ లఘు చిత్రాలను sakshi.com లో వీక్షించండి. -
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-9 ఫైనల్ లిస్ట్ ‘‘ ‘సాక్షి’ మీడియా గ్రూప్ - పూరి జగన్నాథ్ కలిసి నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌కు మంచి స్పందన వచ్చింది. ఐడియా-9 (వేమన పద్యం-‘తప్పులెన్నువారు’)కు నేను న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. వినూత్నమైన ఈ ఐడియాకు చాలా లఘుచిత్రాలు వచ్చాయి. అందులోంచి మూడు ఎంపిక చేశాను. ‘నా లైఫ్ నా ఇష్టం’, ‘విశ్వదాభిరామ వినురవేమ’, ‘విశ్వదాభిరామ’... నాకు బాగా నచ్చిన లఘు చిత్రాలు. కథాంశాన్ని ఒడిసిపట్టుకుని కొంత మంది బాగా తీశారు. వేమన పద్యం అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది ఇంత ఈజీ కాన్సెప్ట్‌ను సరిగ్గా తీయలేదు. ఇంత మంచి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. చాలా లఘుచిత్రాలలో మందు, పొగ తాగే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవసరం లేకుండా ఇలాంటి సన్నివేశాలను చొప్పించడం సరికాదనిపించింది. ఇలాంటి ధోరణి మంచిది కాదు కూడా. పది నిమిషాల వ్యవధిలో ైటె టిల్స్తోనే సగం సమయం గడిచిపోతే, ఇలాంటి అనవసర సన్నివేశాలు సహనానికి పరీక్ష పెట్టాయి. స్టార్ దర్శకుడు అయి ఉండి కూడా పూరీ జగన్నాథ్ కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఇది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు నిస్వార్థమైన సేవ అందించింది ‘సాక్షి’. ఇందులో పాల్గొన్నవారికి పేరుపేరునా అభినందనలు. ఇక ముందు కూడా యువతరం ఇలాంటి అవకాశాలు వదులకోకూడదని కోరుతున్నాను.’’ - భాస్కరభట్ల రవికుమార్, పాటల రచయిత ఐడియా నం.9 జ్యూరీ మెంబర్: భాస్కరభట్ల రవికుమార్ 1) నా లైఫ్ నా ఇష్టం దర్శకుడు: పరమేశ్ రే ణుకుంట్ల 2) విశ్వదాభిరామ వినురవేమ దర్శకుడు: సయ్యద్ అమర్ syedamer18@gmail.com 3) విశ్వదాభిరామ దర్శకుడు: కె. మోహన్ పోటీలోని లఘు చిత్రాలను sakshi.comలో, ఉదయం 10.30 గంటలకు ‘సాక్షి’ టీవీలో చూడొచ్చు. -
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
ఐడియా-8 ఫైనల్ లిస్ట్ ‘‘పూరి జగన్నాథ్ - ‘సాక్షి’ మీడియా గ్రూప్ కలిసి నిర్విహంచిన ‘షార్ట్ ఫిలిం కాంటెస్ట్’లో కొన్ని వందల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. లఘు చిత్రాలపై అభిమానం చూపించిన వారందరికీ నా కంగ్రాట్స్. ఈ కాంటెస్ట్‌లో ఐడియా నంబర్-8 విభాగానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించా. వీటి నుంచి మూడింటిని ఎంపిక చేశా. నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరించినా, మీ లాగే నేను కూడా ఫైనల్ విజేతగా ఏ చిత్రం ఎంపిక అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. గెలవనివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి పోటీలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. చేసిన తప్పులను సరిదిద్దుకుంటే కచ్చితంగా తర్వాత విజయం మీదే.’’ - ఆర్పీ పట్నాయక్, దర్శకుడు - మ్యూజిక్ డెరైక్టర్ ఐడియా నం.8 జ్యూరీ మెంబర్: ఆర్పీ పట్నాయక్ 1) లివింగ్ టుగెదర్ దర్శకత్వం: వాల్మీకి vaddemani@gmail.com 2) హ్యాపీ బ్రేక్ అప్ దర్శకత్వం: శైలజ dsnsailaja@gmail.com 3 కలిసుంటే కలదు దుఃఖం దర్శకత్వం: ఎం.ఎం. వెంకట్ kreative.no1@gmail.com ఈ లఘు చిత్రాలన sakshi.comలో వీక్షించండి. -
త్వరలో విడుదల!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆధ్వర్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’ నిర్వహించిన ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ కు సుమారు 1300 లఘుచిత్రాలు ఎంట్రీలుగా వచ్చాయి. ఒక్కొక్కటి పది నిమిషాల నిడివి ఉన్న ఇన్ని వందల లఘుచిత్రాలను డౌన్లోడ్ చేసి, ఐడియాల వారీగా వేరు చేసి, ప్రాథమిక పరిశీలన నిమిత్తం సిద్ధం చేయడానికి సహజంగానే చాలా సమయం పట్టింది. మరుగున ఉన్న మాణిక్యాలను వెలికితీసే ఈ ‘టాలెంట్ హంట్’లో సినీ ప్రముఖులతో ప్రత్యేక జ్యూరీని ‘సాక్షి’ ఏర్పాటు చేసింది. ఒక్కో ఐడియా ఎంట్రీలకు ఒక్కో సినీ ప్రముఖుడు జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు... త్వరలో... మీ ‘ఫ్యామిలీ’లో... -
గోల్డెన్ ఛాన్స్ అంటున్న మంచు విష్ణు
మంచువారబ్బాయి విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను ప్రారంభించాడు. హీరోగానే కాకుండా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో నిర్మాతగా మారిన మంచు విష్ణు ప్రతి ఏటా పొట్టి సినిమాల కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల పాటు ఈ కాంటెస్ట్ జరగనుంది. ఈ సందర్బంగా విష్ణు ఏం చెప్పాడంటే.. 'సినీ పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన వారికి ఒక గొప్ప అవకాశం కూడా ఉంటుంది. మా సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్‌లో ఏదైనా ఫీచర్‌కు దర్శకత్వం వహించవచ్చు. ఒకసారి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సరిపోదు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిత్యం కొత్త కోణంలో సినిమాలు చేయాలి. నేను కేవలం చిన్న అవకాశం కల్పిస్తున్నాను. ఇదే ఫైనల్ కాదు' అని అన్నారు. షార్ట్ ఫిల్మ్ విజేతలను ప్రతి ఏడాది తన తండ్రి, నటుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్ బాబు పుట్టినరోజు మార్చి 19న ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు.