
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా రూపొందించే డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆలోచన మేరకు ఈ కాంటెస్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ ఔత్సాహికులకు ఆహ్వానం పలుకుతోంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టేలా లఘుచిత్రాలు రూపొందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కాంటెస్ట్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు వాటి పరిష్కారానికి దోహదం చేసినట్లవుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సౌజన్యంతో అందజేస్తున్నట్లు తెలిపారు.
రెండు విభాగాల్లో పోటీలు
డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను రెండు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షార్ట్‌ఫిల్మ్ నిడివి 10 నిమిషాలుగా, డాక్యుమెంటరీ నిడివి 15 నిమిషాలుగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ. 5లక్షలు, రూ.2లక్షలు, రూ.50వేలు, రెండు విభాగాల్లో కలిపి మొత్తం రూ.15 లక్షలను ప్రోత్సాహకంగా అందించనున్నారు.
ఎంట్రీ ఉచితం
ఆసక్తి గలవారంతా పోటీల్లో పాలుపంచుకునేలా ఎంట్రీలను ఉచితంగానే స్వీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 30వ తేదీ గడువు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలు వెలుగులోకి తెచ్చేలా, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా ఔత్సాహికులంతా పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొన్నాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైజాగ్ ఐటీ వింగ్ పిలుపునిచ్చింది. మరిన్ని వివరాలకు 76598 64170 ఫోన్ నంబర్‌లో లేదా ఈ మెయిల్ ysrcp vizagitwing@gmail. com, www.ysrcpvizagitwing.com వైబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.