Short Film Contest On AP Navaratnalu And Women Development Welfare Schemes - Sakshi
Sakshi News home page

‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు

Aug 18 2021 8:36 AM | Updated on Aug 18 2021 6:31 PM

AP Film TV Theatre Development Corporation Short Film Contest On Navaratnalu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌–2021 పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఎండీ ప్రకటన విడుదల చేశారు. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండాలని సూచించారు.

నవంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్‌ కంటెంట్‌ను డీవీడీ/పెన్‌డ్రైవ్, బ్ల్యూరే ఫార్మాట్లలో డిసెంబర్‌ 31లోగా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివరాలకు www. apsftvtdc. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement