నోట్ల రద్దు నేపథ్యంలో..

Vishesh Bhatt to make a film on demonetisation? - Sakshi

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపించాయి. నోట్ల రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో హిందీలో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. ‘మర్డర్‌ 3’ ఫేమ్‌ విశేష్‌ భట్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ‘‘ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. విశేష్‌ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు కొందరు ప్రముఖ నటీనటులతో ఆయన చర్చించాలనుకుంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది’’ అని విశేష్‌ సన్నిహితులు చెబుతున్నారట. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top