ఒక్కడితో ప్రేమ! | Vishal's Okkadochhadu Movie Trailer Vishal, Tamannaah in lead roles | Sakshi
Sakshi News home page

ఒక్కడితో ప్రేమ!

Oct 22 2016 11:16 PM | Updated on Sep 4 2017 6:00 PM

ఒక్కడితో ప్రేమ!

ఒక్కడితో ప్రేమ!

‘‘అగ్ని పర్వతంలో ఎగిసే లావా.. ఆకాశంలో ఉరిమే పిడుగు.. రెండూ కలిస్తే ఈ ఒక్కడు. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాడు.

‘‘అగ్ని పర్వతంలో ఎగిసే లావా.. ఆకాశంలో ఉరిమే పిడుగు.. రెండూ కలిస్తే ఈ ఒక్కడు. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాడు. కానీ, చేసిన తప్పుని సమర్థించేవాణ్ణి ఎప్పటికీ క్షమించడు’’ అన్నారు విశాల్. ఆయన హీరోగా సూరజ్ దర్శకత్వంలో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. తమన్నా కథానాయిక. నవంబర్ మొదటి వారంలో పాటల్ని, 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను కాజల్ అగర్వాల్ విడుదల చేశారు. నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ‘‘విశాల్, తమన్నా లవ్ ట్రాక్ బాగుంటుంది.

వినోదం, సందేశం ఉన్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ ఖర్చుతో చిత్రీకరించాం. హిప్ హాప్ తమిళ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా, సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: రిచర్డ్ ఎం.నాథన్, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్.
 

Advertisement
 
Advertisement
Advertisement