-
నో షార్ట్‌కట్స్!
రంగు మాత్రమేనా... తమన్నా రూపంలోనూ పదేళ్లుగా ఏ మార్పులూ లేవు. ఈ పదేళ్లలో మార్పుల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే... తెలుగు తెరపై తమన్నా నాయికగా అడుగుపెట్టి పదేళ్లు పైనే అయింది. అప్పటి ‘శ్రీ’ నుంచి తాజా సినిమాల వరకూ తమన్నా శరీరాకృతిలో పెద్దగా మార్పులు లేవనే చెప్పుకోవాలి. అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో? చెప్పండి అని తమన్నాను అడిగితే – ‘‘ఏం లేదు. డైట్.. మనం తీసుకునే ఆహారమే నా ఫిట్నెస్ రహస్యం. మీరు శుభ్రమైన ఆహారం తీసుకున్నట్లయితే.. సన్నగా మంచి శరీరాకృతితో ఉంటారు. అంతే తప్ప... ఫిట్నెస్కి దగ్గర దారులంటూ ఏవీ లేవు’’ అన్నారు. తమన్నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమట! ‘‘నా బలహీనత ఏంటో తెలుసా? పానీపూరి. అదొక్కటే కాదు.. చాట్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఇష్టమే. చిన్నప్పుడు స్కూల్లో సమోసాల కోసం లైన్లో నిలబడేదాన్ని. ఇప్పుడు నాకిష్టమైన ఫుడ్స్ అన్నిటినీ పక్కన పెట్టేశా. డైట్ పట్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ మంచినీళ్లు తాగడం నా స్కిన్ సీక్రెట్ అనుకుంటున్నా’’ అన్నారీ సుందరి. అన్నట్టు... బుధవారం తమన్నా పుట్టినరోజు జరుపుకొన్నారు. మరి, ఈ బర్త్‌డే స్పెషల్ ఏంటి? అని అడిగితే.. ‘‘ఈ శుక్రవారం విడుదల కానున్న విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ నాకు స్పెషల్. ఈ సినిమాలో పాటలన్నిటినీ లేడీ రైటర్ చల్లా భాగ్యలక్ష్మి రాశారు. తెలుగులో ప్రత్యేకంగా నా పేరుపై ‘దిల్ చాహ్తాహై నిన్ను చూసి తమన్నా’ అని ఏకంగా ఓ పాట రాయడంతో హ్యాపీ ఫీలయ్యా. ఈ సినిమాను నా పుట్టినరోజు బహుమతిగా భావిస్తున్నా’’ అన్నారు. -
నాకు బిరుదులు వద్దు - విశాల్
‘‘నేను తీసిన ‘బొమ్మరిల్లు’ చిత్రాన్ని హరి చెన్నైలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు తను నిర్మించిన ‘ఒక్కడొచ్చాడు’ హిట్ కావాలని కోరుకుంటున్నా. ‘పందెంకోడి’ చిత్రంలో విశాల్ నటన సూపర్బ్. హార్డ్‌వర్క్ కారణంగానే తను సక్సెస్ అవుతున్నాడు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. విశాల్, తమన్నా జంటగా సురాజ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘కత్తి సండై’ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో జి.హరి ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. జగపతిబాబు విలన్‌గా నటించారు. ‘హిప్ హాప్’ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ‘దిల్’ రాజు విడుదల చేశారు. విశాల్ మాట్లాడుతూ- ‘‘లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న చిత్రమిది. సమాజంలోని ప్రతి మనిషి మైండ్‌కు ఓ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్‌తో మాట్లాడే అవకాశం ఈ చిత్రంలో వచ్చింది. ఐదేళ్ల తర్వాత వడివేలు గారు ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అభిమానులు నాకు ‘యాక్షన్ లెజెండ్’ బిరుదు ఇవ్వాలనుకుంటున్నారు. నాకు అవేవీ వద్దు.. విశాల్‌గానే ఉండాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘విశాల్ మంచి నటుడే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. తను నాకు స్ఫూర్తి’’ అని తమన్నా చెప్పారు. చిత్ర నిర్మాత హరి, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సి. కల్యాణ్, మిర్యాల రవీందర్ రెడ్డి, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, దర్శకులు శ్రీవాస్, మెహర్ రమేశ్, హీరోయిన్లు శ్రీదివ్య, మెహరీన్ పాల్గొన్నారు. -
ఒక్కడితో ప్రేమ!
‘‘అగ్ని పర్వతంలో ఎగిసే లావా.. ఆకాశంలో ఉరిమే పిడుగు.. రెండూ కలిస్తే ఈ ఒక్కడు. తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాడు. కానీ, చేసిన తప్పుని సమర్థించేవాణ్ణి ఎప్పటికీ క్షమించడు’’ అన్నారు విశాల్. ఆయన హీరోగా సూరజ్ దర్శకత్వంలో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. తమన్నా కథానాయిక. నవంబర్ మొదటి వారంలో పాటల్ని, 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను కాజల్ అగర్వాల్ విడుదల చేశారు. నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ‘‘విశాల్, తమన్నా లవ్ ట్రాక్ బాగుంటుంది. వినోదం, సందేశం ఉన్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ ఖర్చుతో చిత్రీకరించాం. హిప్ హాప్ తమిళ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా, సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: రిచర్డ్ ఎం.నాథన్, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్‌పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement