నాలుగేళ్లకు మళ్లీ!

Vishal is Thupparivaalan 2 goes on floors in Bristol - Sakshi

నాలుగేళ్లు కావొస్తోంది నటి గౌతమి తమిళ స్క్రీన్‌పై కనిపించి. 2015లో వచ్చిన ‘పాపనాశం’ సినిమాలో చివరిసారి కనిపించారు గౌతమి. ఈ మధ్యకాలంలో తెలుగులో ‘మనమంతా’, మలయాళంలో ‘ఈ’ అనే సినిమాల్లో కనిపించారామె. నాలుగేళ్ల బ్రేక్‌ తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీరించారట గౌతమి. హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్‌ కాంబినేషన్‌లో ‘తుప్పరివాలన్‌ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ‘తుప్పరివాలన్‌’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఆశ్య కథానాయిక. ఈ సినిమాలో గౌతమి కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు గౌతమి. ‘తు ప్పరివాలన్‌’ ఫస్ట్‌ పార్ట్‌లో సిమ్రాన్‌ అతిథి పాత్రలో కనిపించారు. బహుశా ఇప్పుడు గౌతమి అతిథి అయ్యుండొచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top