ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు' | Vishal movie Release advanced to december | Sakshi
Sakshi News home page

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

Dec 15 2016 3:44 PM | Updated on Sep 4 2017 10:48 PM

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

కోలీవుడ్లో వరుస హిట్స్తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో విశాల్. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కొడచ్చాడు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్..

కోలీవుడ్లో వరుస హిట్స్తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో విశాల్. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కొడచ్చాడు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్.. ఆ సినిమాను అనుకున్న సమయం కన్నా ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేశాడు విశాల్. అయితే సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడ్డాడు.

తాజాగా సింగం 3 వాయిదా పడుతుందన్న వార్తలతో ఊపిరి పీల్చుకున్న విశాల్, ఆ గ్యాప్లో తన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ 23న రిలీజ్ అవుతుందనుకున్న సింగం 3 మరో వారం వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో డిసెంబర్ 23న తన సినిమా ఒక్కడొచ్చాడును రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. విశాల్ సరసన తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement