బైక్‌ పోగొట్టుకున్న విదార్థ్‌ | Visdhardh's hero Hashir is producing the film is vandi. | Sakshi
Sakshi News home page

బైక్‌ పోగొట్టుకున్న విదార్థ్‌

Jul 17 2017 3:32 AM | Updated on Sep 5 2017 4:10 PM

బైక్‌ పోగొట్టుకున్న విదార్థ్‌

బైక్‌ పోగొట్టుకున్న విదార్థ్‌

నటుడు విదార్థ్‌ కొత్తగా మోజు పడి కొనుకున్న బైక్‌ పోగొట్టుకున్నాడు.

తమిళసినిమా: నటుడు విదార్థ్‌ కొత్తగా మోజు పడి కొనుకున్న బైక్‌ పోగొట్టుకున్నాడు. ఎలా? ఏమాకథ అంటారా? అది తెలుసుకోవాలంటే వండి చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే. ఆ వివరాల్లోకెళితే పోయిన తన సైకిల్‌ కోసం ఓ కుర్రాడు వెతుకుతూ చివరికి వేరే వ్యక్తి సైకిల్‌ దొంగిలించాల్సిన పరిస్థితికి వస్తాడు.

పోయిన అతని సైకిల్‌ ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం బైస్కిల్‌ థీవ్స్‌ అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ మధ్య తన తండ్రి జీవితాంతం సంపాదించి కూడబెట్టిన డబ్బుతో మోటార్‌బైక్‌ కొనుకున్న యువకుడిని అప్పటి వరకూ పట్టించుకోని అమ్మాయిలు ప్రేమిం చడం మొదలెడతారు. ఆ యువకుడికి మంచి ఉద్యోగం వస్తుంది. దీంతో జీవితం ఆనందంగా సాగిపోతుంది. అలాంటి పరిíస్థితుల్లో అతని బైక్‌ చోరీ అవుతుంది.

ఇది పొల్లాదవన్‌ చిత్రం. కాగా ఆ తరహాలో నటుడు విదార్థ్‌ ముచ్చటపడి కొనుక్కున యమహా బైక్‌ దొంగతనానికి గురవుతుంది. అది ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వండి అని ఆ చిత్ర దర్శకుడు రజీష్‌బాలా తెలిపారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూబీ ఫిలింస్‌ పతాకంపై హషీర్‌ నిర్మిస్తున్న చిత్రం వండి. ఇందులో మోటార్‌బైక్‌ ఒక పాత్రగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. విదార్థ్‌కు జంటగా నటి చాందిని నటిస్తున్న ఇందులో శ్రీరామ్‌ కార్తీక్, ఎంఆర్‌.కిశోర్‌కుమార్, జాన్‌విజయ్, అరుళ్‌దాస్, స్వామినాథన్, మదన్‌బాబు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement