విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్? | Vijayendraprasad directed by Ajay? | Sakshi
Sakshi News home page

విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్?

Jul 10 2016 11:42 PM | Updated on Sep 4 2017 4:33 AM

విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్?

విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అజయ్?

సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు

సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఘన విజయం సాధించడంతో టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్రానికి అద్భుతమైన కథ అందించారాయన. ఇప్పుడు కూడా విజయేంద్రప్రసాద్ ఓ హిందీ సినిమాకి కథ అందించే పని మీద ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ‘ఒకే ఒక్కడు’ హిందీ రీమేక్ ‘నాయక్’ సీక్వెల్‌కు కథ అందిస్తున్నారాయన. అలాగే అజయ్ దేవగణ్ కోసం ఓ కథ రాస్తున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది.


‘కబీర్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుందట. 1992లో వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని కథగా రాస్తున్నట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భారతదేశంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని టాక్. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహ్లాని నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement