బైక్‌ నంబర్‌ 96

Vijay Sethupathi gifts Royal Enfield bike to 96 director Prem Kumar - Sakshi

హీరోలకు కెరీర్‌లో మరచిపోలేని హిట్స్‌ అందించినప్పుడు హీరోలు ఆ దర్శకులకు ఏదో గిఫ్ట్‌ ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌కు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను గిఫ్ట్‌గా అందించారు విజయ్‌ సేతుపతి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘96’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. విజయ్‌ సేతుపతికి బైక్స్‌ అంటే ఇష్టమట. అందుకే తన దర్శకుడికి బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తే బావుంటుందని భావించి ఎన్‌ఫీల్డ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. సుమారు 3 లక్షలు ఖరీదైన ఈ బైక్‌ స్పెషాలిటీ ఏంటంటే ఈ బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ‘0096’. సినిమా టైటిల్‌ కూడా కలిసేలా ప్లాన్‌ చేసి, ఇలా ప్రెజెంట్‌ చేయడంతో ప్రేమ్‌కుమార్‌ ఆశ్చర్యపోయింటారు. ఈ సినిమా తెలుగులో ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలోనే శర్వానంద్, సమంత జంటగా రూపొందనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top