మొదలిక మళ్లీ ‘గీత గోవిందం’

Vijay Devarakonda Geetha Govindam First Single Out - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్‌ తనదైన స్టైల్‌లో ట్వీటర్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు విజయ్‌.

ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌ ఈ రోజు(మంగళ వారం) తొలి పాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే క్లాసికల్‌ మెలోడియస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించిన ఈ పాటను సిద్ధి శ్రీరామ్‌ ఆలపించారు. పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top