బాలీవుడ్‌ నటుడికి అరుదైన గౌరవం

VidyutJammwal Is One Of The Top 6 Martial Artists Across The World - Sakshi

తెలుగులో శక్తి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్‌ తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ పోరాట కళ కలరియపట్టులో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యుత్‌ జమ్వాల్‌ ప్రపంచంలోని టాప్‌ సిక్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కళాకరుల జాబితాలో స్థానం సంపాదించాడు.

అమెరికాకు చెందిన లూపర్‌ అనే వెబ్‌ సైట్‌ ఈ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌ లో విద్యుత్‌ జమ్వాల్‌తో పాటు స్కాట్‌ అడ్కిన్స్‌, అతీఫ్ క్రౌడర్‌, ఇల్రామ్‌ చోయి, మార్కో జిరోర్‌, యు జింగ్‌, జానీ ట్రిగ్యుయెన్‌ లు ఉన్నారు. ‘గొప్ప మార్షల్‌ ఆర్ట్స్‌ కళాకారుడు అంటే తెలుసుకోవాల్సింది ప్రత్యర్థిపై దాడి చేయటం కాదు, ఓపికగా ప్రత్యర్థిని దెబ్బతీయటం తెలుసుకోవాల’న్నారు విద్యుత్‌ జమ్వాల్‌. ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువ కళాకారుడు బాలీవుడ్ చిత్రాల్లో హీరోగానూ రాణిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top