రజనీ సినిమాలో విద్యాబాలన్‌ | vidyabalan to act in super star rajani movie | Sakshi
Sakshi News home page

రజనీ సినిమాలో విద్యాబాలన్‌

Feb 22 2017 6:45 PM | Updated on Sep 5 2017 4:21 AM

రజనీ సినిమాలో విద్యాబాలన్‌

రజనీ సినిమాలో విద్యాబాలన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్కు జంటగా నటి విద్యాబాలన్‌ నటించనున్నారు.

చెన్నై:
సూపర్‌స్టార్‌ రజనీకాంత్కు జంటగా నటి విద్యాబాలన్‌ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్‌ పా దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ రూపొందిస్తోంది. మే లో  షూటింగ్‌ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించనున్నట్టు సమాచారం. దీని గురించి విద్యాబాలన్‌తో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే విద్యబాలన్ మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో చిత్ర అవవకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలోనూ రజనీ వృద్ధ గెటప్‌లో నటించనున్నారని  సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement