త్వరలో సెట్స్‌ మీదకు ‘అమ్మ’ బయోపిక్‌

Vibri Media To Produce the Biopic Of Jayalalitha - Sakshi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌పై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు తెలుగు, తమిళ చిత్రాల దర్శక నిర్మాతలు అమ్మ కథను వెండితెర మీద చూపించేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు.  తాజాగా ఓ నిర్మాణ సంస్థ అమ్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విబ్రి మీడియా సంస్థ జయలలిత బయోపిక్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రకటనను విడుదల చేసి విబ్రి మీడియా ఎంతో ప్రభావవంతమైన మహిళ నేత జీవిత చరిత్రను రూపొందించటం గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ బయోపిక్‌ సినీ రాజకీయ రంగాల్లో ఆమె సాధించిన విజయాలకు ఓ నివాళిగా రూపొదిస్తున్నట్టుగా తెలిపారు.

సినిమాను ఆమె జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24 ప్రారంభిస్తామని అదే రోజు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. మదారసీ పట్టణం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అవార్డ్‌విన్నింగ్‌ దర్శకుడు విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటించనున్నారని వెల్లడించారు. గత పదేళ్లుగా ఎన్నో టెలివిజన్‌ షోస్‌ను నిర్మించిన విబ్రి మీడియా ప్రస్తుతం 1983 వరల్డ్‌కప్ నేపథ్యంలో 83 సినిమాతో పాటు ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధరంగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యన్‌.టి.ఆర్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top