'గోపాలా..గోపాలా..'లో దగ్గుబాటి అర్జున్?
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నారనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నారనే వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. హిందీలో విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రం ఆధారంగా రూపొందుతున్న 'గోపాలా.. గోపాలా.. చిత్రంలో వెంకటేశ్ కుమారుడిగా అర్జున్ కనిపించబోతున్నారనే రూమర్ వినిపిస్తోంది. వెంకటేశ్ కుమారుడిగా అర్జున్ ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. కొద్ది నిమిషాల పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రానికి పనిచేస్తున్న బృందంలోని సభ్యులు తెలిపారు.
ఓ మై గాడ్ చిత్రంలో పరేశ్ రావెల్ పోషించిన పాత్రను వెంకటేశ్, అక్షయ్ కుమార్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. శ్రీయ సరన్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మరార్, సురేశ్ ప్రోడక్షన్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రానికి కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.