మామా మేనల్లుడి కథ

Venkatesh-Naga Chaitanya new film launched - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో ఒక కథానాయికగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తున్నారు. మరొక కథానాయికగా హ్యూమా ఖురేషీ పేరును పరిశీలిస్తున్నారు. ‘‘నేను దర్శకత్వం వహించనున్న నెక్ట్స్‌ చిత్రంలో వెంకటేశ్‌గారు, నాగచైతన్య నటిస్తున్నారు. అవును.. మామా, మేనల్లుడి  బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా కథ సాగుతుంది.

అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు బాబీ. ‘‘మా బ్యానర్‌లో నెక్ట్స్‌ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ మొదలైందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’’ అని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అని రకుల్‌ పేర్కొన్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. ఈ కార్యక్రమంలో నటుడు రానా, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, కోన వెంకట్, టీజీ. విశ్వప్రసాద్, కెమెరామేన్‌ ప్రసాద్‌ మూరెళ్ల  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top