యంగ్ హీరో తండ్రిగా వెంకీ..? | venkatesh guest appearance in naga chaitanya movie | Sakshi
Sakshi News home page

యంగ్ హీరో తండ్రిగా వెంకీ..?

Jun 10 2016 8:29 AM | Updated on Sep 4 2017 2:05 AM

యంగ్ హీరో తండ్రిగా వెంకీ..?

యంగ్ హీరో తండ్రిగా వెంకీ..?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించాడన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగ చైతన్య, వెంకటేష్ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

నాగ్ చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. కొన్ని కీలక సన్నివేశాల్లో చైతూ తండ్రిగా వెంకీ నటించాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చే సీన్స్, షూట్ కూడా జరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నిజ జీవితంలో మామ అల్లుళ్లు వెండితెర మీద తండ్రీ కొడుకులుగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement