సూపర్‌ శిక్షణ | Varun Tej wraps up his US training session and sports a lean look | Sakshi
Sakshi News home page

సూపర్‌ శిక్షణ

Apr 3 2019 2:34 AM | Updated on Apr 3 2019 2:34 AM

Varun Tej wraps up his US training session and sports a lean look - Sakshi

వరుణ్‌ తేజ్, టోనీ డేవిడ్‌

బాక్సింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకోవడానికి రెండు నెలలుగా వరుణ్‌ తేజ్‌ ఫారిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్‌ శిక్షణ ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనే వరుణ్‌ బాక్సర్‌గా నటించనున్నారు. ఇందుకోసం శిక్షణ తీసుకోవడానికే ఆయన ఫారిన్‌ వెళ్లారు.

ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్‌ బాక్సర్‌ టోనీ డేవిడ్‌ జెఫ్రీస్‌ వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ‘‘టోనీ జెఫ్రీస్‌ నీతో రెండు నెలలుగా శిక్షణ బాగా జరిగింది. ఇప్పుడు మిస్‌ అవుతున్నాను. త్వరలో ట్రైనింగ్‌ మళ్లీ స్టార్ట్‌ చేద్దాం’’ అని పేర్కొన్నారు వరుణ్‌ తేజ్‌. ఇక్కడ లేటెస్ట్‌ వరుణ్‌తేజ్‌ లుక్‌ని గమనిస్తే... వరుణ్‌ బాగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. పాత్ర కోసమే ఇదంతా అని ఊహించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement