జర్నలిస్ట్‌ ఏం చేశాడు? | varun sandesh daadi movie launch | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ ఏం చేశాడు?

Dec 20 2018 12:24 AM | Updated on Dec 20 2018 12:24 AM

varun sandesh daadi movie launch - Sakshi

జీవన్, చెరిష్మా, వరుణ్‌ సందేశ్, శివాజీ రాజా

‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్‌ చాట్‌ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’.

మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్‌ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏడిద శ్రీరామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శివాజీ రాజా క్లాప్‌ ఇచ్చారు. మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్‌ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’’ అని శంకర్‌ ఆరా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్‌ ఈదర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకటేశ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement