పరమ వీర

Varun Dhawan to collaborate with Sriram Raghavan for Arun Khetarpal biopic - Sakshi

‘బద్లాపూర్‌’ వచ్చిన నాలుగేళ్లకు దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో వరుణ్‌ ధావన్‌ ఓ సినిమా కోసం కలసి పని చేయనున్నారు. 1971 ఇండియా–పాక్‌ యుద్ధంలో మరణించిన సెకండ్‌ ల్యూటినెంట్‌ అరుణ్‌ కేత్రపాల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అరుణ్‌ కేత్రపాల్‌ ధైర్యానికి పరమవీర చక్రను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ‘‘సైనికుడి పాత్రలో నటించాలన్నది నా కల. ఈ సినిమాతో అది నెరవేరబోతోంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. శ్రీరామ్‌ రాఘవన్‌గారితో మరోసారి పనిచేయడం చాలా సంతోషం’’ అని వరుణ్‌ ధావన్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top