హ్యాపీ జర్నీ | varalakshmi sarath kumar enter to vijay new movie | Sakshi
Sakshi News home page

హ్యాపీ జర్నీ

Jun 2 2018 2:53 AM | Updated on Jun 2 2018 2:53 AM

varalakshmi sarath kumar enter to vijay new movie - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌

హీరోయిన్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఆనందానికి అవధుల్లేవ్‌. కారణం ఏంటో తెలుసా? విజయ్‌ సినిమా సెట్‌లో జాయిన్‌ అవ్వడమే. ‘తుపాకి, కత్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా మరో చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

చెన్నైలో జరుగుతోన్న ఈ సినిమా సెట్‌లోకి శుక్రవారం ఫస్ట్‌ టైమ్‌ ఎంటర్‌ అయ్యారు వరలక్ష్మీ ‘‘విజయ్‌ సార్‌తో నేను నటిస్తోన్న సినిమా హ్యాపీ జర్నీ సారై్టంది. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ను చెన్నైలోనే చేస్తారట. స్మాల్‌ షెడ్యూల్‌ కోసం ఫారిన్‌ వెళ్తారట. అలాగే హీరో విజయ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement