ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్... | 'Uthama Villain' will Release Worldwide on 2 April, Confirms | Sakshi
Sakshi News home page

ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్...

Mar 3 2015 11:24 PM | Updated on Apr 3 2019 8:51 PM

ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్... - Sakshi

ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్...

ప్రముఖ నటుడు, దర్శక - నిర్మాత కమలహాసన్ ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం-2’,

 ప్రముఖ నటుడు, దర్శక - నిర్మాత కమలహాసన్ ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం-2’, మలయాళ హిట్ ‘దృశ్యం’కు తమిళ రీమేకైన ‘పాపనాశం’ చిత్రాలు మూడింటి షూటింగ్‌నూ ముగించిన ఈ అలుపెరుగని నటుడు ముందుగా ‘ఉత్తమ విలన్’గా పలకరించనున్నారు. ఒకపక్క ఏప్రిల్‌లో ఆ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోపక్క కొత్త చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు - కమల్. స్వీయ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించడానికి లొకేషన్లను వెతుక్కుంటూ ఇటీవలే ఆయన మారిషస్‌కు కూడా వెళ్ళివచ్చారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్ అది. ‘ఉత్తమ విలన్’ రిలీజవగానే, ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలవు తుంది.
 
  ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌కు ప్రీ-ప్రొడక్షన్ పని జరుగుతోంది’’ అని కమలహాసన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, మరోపక్క ఓ పూర్తి నిడివి హిందీ సినిమా కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారట! అయితే, అది పూర్తిగా రాజకీయ కథాంశమని భోగట్టా. నిర్మాతలు వీరేందర్ అరోరా, అర్జున్ కె. కపూర్‌లతో కలసి ఆయన ఆ సినిమా నిర్మిస్తారని కోడంబాకమ్ కబురు. మరి వీటి మధ్య ఆమిర్‌ఖాన్ ‘పీకే’ తమిళ రీమేక్‌కు కమల్ ఎలా డేట్లు సర్దుతారన్నది ఆసక్తికరం. ఏమైనా, ‘ఉత్తమ విలన్’ తమిళ పాటలను ఇటీవల డిజిటల్ డౌన్‌లోడ్ రూపంలో ఆధునికంగా విడుదల చేసి, అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ‘ఉలగ నాయకన్’ (లోకనాయకుడు) కొత్త స్క్రిప్టులనూ అంతే ఆమళ్ళీ మ్యాజిక్? దునిక శైలిలో తీర్చిదిద్దుతారని వేరే చెప్పాలా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement