చెర్రీ పాఠాలు చెబుతున్నాడట..!

చెర్రీ పాఠాలు చెబుతున్నాడట..!


రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తరువాత ఉపాసనకు కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అపోలో బాధ్యతలతో పాటే మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను తీసుకున్న ఉపాసన సోషల్ మీడియాలో మెగా అభిమానుల కోసం ఇంట్రస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మిస్టర్ సి( ఉపాసన చరణ్ ను మిస్టర్ సి అని పిలుస్తుంటుంది) వీడియో ఒకటి పోస్ట్ చేశారు.రామ్ చరణ్ నడిచి వస్తుండగా అతని వెంట నాలుగు కుక్కపిల్లలు వస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన ఉపాసన.. 'మిస్టర్ సి ఆరోగ్యకరమైన జీవితానికి గోల్స్ ఉండాలని చెబుతున్నారు. బద్ధకం అనేది ఓ జీవితంలో ఓ జబ్బు లాంటింది. కాబట్టి ఇక కదలండి' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ తో పాటు సై రా నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చరణ్.


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top