ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు | Two Telugu Movies for Oscar Screening | Sakshi
Sakshi News home page

ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు

Aug 31 2013 12:00 AM | Updated on Sep 1 2017 10:17 PM

ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు

ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు

‘మిథునం’, ‘జగద్గురు ఆదిశంకర’ చిత్రాలు డబుల్ ధమాకా సాధించాయి. ఈ రెండు సినిమాలూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమా తరఫున నామినేట్ అయ్యాయి.

‘మిథునం’, ‘జగద్గురు ఆదిశంకర’ చిత్రాలు డబుల్ ధమాకా సాధించాయి. ఈ రెండు సినిమాలూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమా తరఫున నామినేట్ అయ్యాయి. నిర్మాతలు మండలి అధికారికంగా ఈ రెండు చిత్రాలను ఎంపిక చేసింది. 
 
అలాగే గోవాలో నవంబరులో జరుగనున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగానికి ఈ రెండు సినిమాలూ ఎంపిక కావడం విశేషం. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి జంటగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన ‘మిథునం’ గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. జేకే భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన ‘జగద్గురు ఆదిశంకర’ ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement