బుల్లితెర నటుడు విజయ్‌రాజ్‌ మృతి

TV Artist Vijay Raj Died With Heart Stroke In Tamil Nadu - Sakshi

తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు విజయ్‌రాజ్‌(43) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పళని, ఇడుంబన్‌మలైకు చెందిన విజయ్‌రాజ్‌  కోలంగళ్, మెట్టిఒళి, నాదస్వ రం మెగా సీరియళ్లలో నటించారు. ఎండన్‌ మగన్‌ వంటి కొన్ని చిత్రాల్లోనూ నటిం చిన విజయ్‌రాజ్‌ మూడు రోజుల క్రి తం దీపావళి పండుగను కుటుం బ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లారు. అక్కడ శనివారం సాయంత్రం అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విజయ్‌రాజ్‌ను పరీక్షించిన వైద్యులు తను మార్గమధ్యంలోనే  మరణించినట్లు తెలిపారు. విజయ్‌రాజ్‌కు భార్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top