భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి | TV Actress Shweta Tiwari files domestic violence case against husband | Sakshi
Sakshi News home page

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

Aug 12 2019 3:51 PM | Updated on Aug 12 2019 3:57 PM

TV Actress Shweta Tiwari files domestic violence case against husband - Sakshi

ముంబై: ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్‌ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత గృహహింస కేసును నమోదు చేశారు.  అంతేకాకుడా  శ్వేత కుతూరు పాలక్‌ తివారీకి అతను అసభ్య ఫొటోలను చూపించినట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి. 

నటి శ్వే తా తివారీ ఆదివారం మధ్యాహ్నం భర్తకు వ్యతిరేకంగా ముంబై సమతా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వెంట తల్లి, కూతురు పాలక్‌ ఉన్నారు. మద్యం మత్తులో అనుభవ్‌ నిత్యం తనను కొట్టేవాడని, కోపంలో ఓసారి పాలక్‌పై కూడా అతను చేయి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుభవ్‌ను స్టేషన్‌కు పిలిచి.. నాలుగుగంటలపాటు చర్చించిన అనంతరం అరెస్టు చేశారు. 

శ్వేత తివారి గతంలో రాజా చౌదరిని పెళ్లాడారు. వీరికి కూతురు పాలక్‌ ఉంది. గృహహింస బారిన పడిన ఆమె 2007లో రాజాతో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం డేటింగ్‌ చేసిన అనుభవ్‌ కోహ్లిని 2013లో ఆమె పెళ్లాడారు. వీరికి రెండేళ్ల కొడుకు రెయాన్ష్‌ కొహ్లి ఉన్నాడు. శ్వేత-అనుభవ్‌ మధ్య గొడవలు రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ వీరు గొడవలు పడ్డట్టు కథనాలు వచ్చాయి. ‘కౌసటి  జిందగి క్యా’ సీరియల్‌లో ప్రేరణగా అత్యంత పాపులర్‌ అయిన శ్వేత.. పలు టీవీ సీరియళ్లతోపాటు హిందీ బిగ్‌బాస్‌-4 విన్నర్‌గా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement