లవ్‌స్టోరీ వివాదం.. నటుడి కీలక నిర్ణయం

Truth Is Not Palatable To Everybody, Says Nawazuddin Siddiqui - Sakshi

సాక్షి, ముంబై: తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే దానిలో అభూత కల్పనలే ఉంటాయని బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ అన్నారు. ‘ఆన్‌ ఆర్డినరీ లైఫ్‌’​ పేరిట గతేడాది తాను రాసిన ఆత్మకథలో ఐదు పేజీలు తన ప్రేమాయణం గురించి రాయడంపై విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తమ కలను సాకారం చేసుకునేందుకు చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు ‘బాలీవుడ్‌ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

209 పేజీలున్న ఈ పుస్తకంలో 5 పేజీలు మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్‌, సునీత రాజ్‌వర్‌లతో సాగించిన ప్రేమాయణం గురించి నవాజుద్దీన్‌ పూసగుచ్చారు. సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించారు. అంతేకాదు క్షమాణలు కూడా చెప్పారు.

ఈ వివాదం జరిగి ఏడాదైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘పుస్తకంలో మొత్తం 209 పేజీలున్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా? నా ప్రేమకథను బయపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు. వాస్తవాలను చెప్పాలని మాత్రమే అనుకున్నాను. ఎవరి జీవితంలోనైనా వాస్తవం అనేది కథలా ఉండద’ని నవాజుద్దీన్‌ అన్నారు. ఇక ముందు తన జీవిత​ చరిత్ర రాస్తే అందులో అబద్దాలే ఉంటాయని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top