వారి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్‌ షో?

trivikram meets talsani srinivasarao - Sakshi

పవన్‌​ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుని  ఈ నెల 10 న విడుదలకు సిద్ధమైంది. ఒక్కరోజు ముందే అంటే 9వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్‌ షో పడిపోనుంది. అయితే ఈ సినిమా స్పెషల్‌ షోకి రావాల్పిందిగా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆహ్వానించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. మెగా ఫ్యామిలీ కోసం రెండు రోజుల ముందుగానే 'అజ్ఞాతవాసి' స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేయనున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రంలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యూయేల్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్‌ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్‌ ఉంది. హారిక హాసిని క్రియేషన్స్‌లో ఎస్‌  రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్‌ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ పవన్ కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top