అధర్వతో చెన్నై చిన్నది? | trisha with adarva in next movie? | Sakshi
Sakshi News home page

అధర్వతో చెన్నై చిన్నది?

Dec 19 2016 1:30 AM | Updated on Sep 4 2017 11:03 PM

అధర్వతో చెన్నై చిన్నది?

అధర్వతో చెన్నై చిన్నది?

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా మారింది యువనటుడు అధర్వ టైమ్‌.

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా మారింది యువనటుడు అధర్వ టైమ్‌. ఇటీవలే నిర్మాతగా అవతారమెత్తి చమ్మ బోద ఆగాదు చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరో పక్క ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో అగ్రనాయకి నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇందులో నయనతార ఆయనకు అక్కగా సెంటరిక్‌ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నయనతార నెచ్చెలి, వృత్తిపరంగా పోటీ నటి అయిన చెన్నై చిన్నది త్రిషతో రొమాన్స్ చేయడానికి అధర్వ సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. సంచలన దర్శకుడు బాలా శిషు్యడు విటో వివేక్‌ మోగాఫోన్  పట్టడానికి రెడీ అయ్యారు.

ఈయన అధర్వ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధర్వతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని అధర్వ స్పష్టం చేశారు. దర్శకుడు విటో వివేక్‌ చెప్పిన కథ ఆసక్తికరంగా ఉందన్నారు.అయితే తాను అందులో నటించే విషయం చర్చల దశలోనే ఉందన్నారు. ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్‌ కథా చిత్రమేనట. ఇందులో నాయకిగా నటించడానికి నటి త్రిషను ఎంపిక చేసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటించే నటీనటుల వివరాల గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్‌ కాదంటున్నారు దర్శకుడు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement