breaking news
imaika nodigal
-
బిలీవ్ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా
సామాజిక స్పృహ ఉన్న నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. చేసేది వ్యాపారమే అయినా అందులోనూ ప్రజలకు అవసరమైనదో, వారికి స్ఫూర్తి నిచ్చే విషయాలు ఉండాలని భావించేవారు అరుదనే చెప్పాలి. వర్ధమాన నటి రాశిఖన్నా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక వీడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హైదరాబాదీ బ్యూటీ టాలీవుడ్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. అంతే కాదు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే స్టేజీలో ఉంది. అయితే ఆదిలోనే మెడ్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంలో నటించింది. మొత్తానికి బహుభాషా నటిగా అవతారమెతి్తన రాశిఖన్నా తమిళంలో సైతాన్ కా బచ్చా అనే చిత్రంతో పాటు నయనతార నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కథానాయకిగా బిజీగా ఉన్న రాశిఖన్నా తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓకే నటిగా అమ్మడు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నిర్మాతగా, కవిగానూ మారడం విశేషం. నిర్మాతగా అనగానే తనేదో చిత్రం నిర్మిస్తోందని అనుకోకండి. ఒక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది.బిలీవ్ ఇన్ యూ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌ను అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. బిలీవ్ ఇన్ యూ( నిన్ను నీవు నమ్ము)ఈ పేరే అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంది కదూ‘ ఇందులో ఒక కవితను కూడా రాశిఖన్నా రాసిందట. ఐయామ్ నాట్ ది సైజ్ ఆఫ్ మై జీన్స్ ..ఐయామ్ ది సైజ్ ఆఫ్ మై స్మైల్ వంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిని కలిగించే కవితను రాశిఖన్నా ఈ ఆల్బమ్ కోసం రాసిందట.ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ఈ వీడియో ఆల్బమ్ పొందే స్పందన కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు నటి రాశిఖన్నా పేర్కొంది. -
అధర్వతో చెన్నై చిన్నది?
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టుగా మారింది యువనటుడు అధర్వ టైమ్. ఇటీవలే నిర్మాతగా అవతారమెత్తి చమ్మ బోద ఆగాదు చిత్రం నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. మరో పక్క ఇమైకా నోడిగళ్ చిత్రంలో అగ్రనాయకి నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇందులో నయనతార ఆయనకు అక్కగా సెంటరిక్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నయనతార నెచ్చెలి, వృత్తిపరంగా పోటీ నటి అయిన చెన్నై చిన్నది త్రిషతో రొమాన్స్ చేయడానికి అధర్వ సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. సంచలన దర్శకుడు బాలా శిషు్యడు విటో వివేక్ మోగాఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఈయన అధర్వ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధర్వతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని అధర్వ స్పష్టం చేశారు. దర్శకుడు విటో వివేక్ చెప్పిన కథ ఆసక్తికరంగా ఉందన్నారు.అయితే తాను అందులో నటించే విషయం చర్చల దశలోనే ఉందన్నారు. ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమేనట. ఇందులో నాయకిగా నటించడానికి నటి త్రిషను ఎంపిక చేసే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఇందులో నటించే నటీనటుల వివరాల గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు దర్శకుడు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు.