అడవిలో ఓ రాత్రి!

Trisha plays a doctor in Paramapadham Vilayattu - Sakshi

పదిహేనేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో కొనసాగుతూనే ఉన్నారు చెన్నై బ్యూటీ త్రిష. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారామె. ఇన్నేళ్లయినా ఇంకా అదే అంకితభావంతో పని చేస్తున్నారామె. అందుకు తాజా ఉదాహరణ... పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి రెండుగంటలు ముందే షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లిపోయి, రిహార్సల్స్‌ చేశారట. త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘పరమపదమ్‌ విళయాట్టు’. త్రిష కెరీర్‌లో ఇది 60 చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి కె. తిరుజ్ఞానమ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ త్రిష పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల కానుంది. నటుడు విజయ్‌ సేతుపతి విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా జర్నీ గురించి తిరుజ్ఞానమ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా తల్లి పాత్ర చేశారు. త్రిషకు నటిగా చాలా అనుభవం ఉన్నప్పటికీ సెట్‌కు రెండుగంటలు ముందే వచ్చేవారు. షూట్‌కు ముందే సీన్లను ప్రాక్టీస్‌ చేసేవారు. ప్రతి సీన్‌ పర్‌ఫెక్ట్‌గా రావాలని కోరుకునేవారు. అడవుల్లో కొన్ని యాక్షన్‌ సీన్లు తీశాం. కొన్నింటిని డూప్‌ లేకుండా చేశారామె. సినిమాల పట్ల ఆమెకు ఉన్న అంకితభావం సూపర్‌’’ అన్నారు. ‘‘పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇది ఫస్ట్‌ టైమ్‌. డాక్టర్‌ వృత్తి చేస్తున్న ఓ తల్లి అడవిలో ఓ రాత్రి ఎదుర్కొనే భిన్నపరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని పేర్కొన్నారు త్రిష.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top